శ్రియను కౌగిలించుకోవాలనిపించింది: మోహన్ బాబు

  • విష్ణు సీరియస్ అవుతాడని ఆగుతున్నా
  • అనసూయను కౌగిలించుకోగలను
  • శ్రియ నటన అత్యద్భుతం
తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో శ్రియ సినిమాలు చూశానని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సరదాగా వ్యాఖ్యానించారు. 'గాయత్రి' సినిమా ఆడియో లాంచ్ ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ, తన బ్యానర్ లో ఎంతో మంది హీరోయిన్లు నటించారని... కానీ, శ్రియ ఈ సినిమాలో అత్యద్భుతంగా నటించిందని చెప్పారు. ప్రతి సన్నివేశంలో శ్రియ కనబరిచిన నటన అమోఘమని తెలిపారు.

విష్ణు సరసన నటించింది కాబట్టి తాను వదిలేశాలని... తనకు కూడా శ్రియను కౌగిలించుకోవాలనే ఉందని చెప్పారు. యాంకర్ అనసూయను కౌగిలించుకోగలను కానీ, శ్రియను కౌగిలించుకుంటే విష్ణు సీరియస్ అవుతాడని నవ్వుతూ అన్నారు. 'గాయత్రి' సినిమాలో శ్రియ నటన ఇప్పటి జనరేషన్ లో మరో హీరోయిన్ చేయలేదని కితాబిచ్చారు.
Go Back to Shorts
mohan babu
manchu vishnu
shriya
tollywood
gayatri movie

More Telugu News